కృష్ణా: అనారోగ్య కారణాలవల్ల కంకిపాడులో జరిగే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు సినీ నటుడు బాబు మోహన్ ఓ వీడియో విడుదల చేశారు. బాపులపాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్తె అన్విత ఇటీవల నీట్లో 202 ర్యాంక్ సాధించగా, అభినందన కార్యక్రమానికి సినీ నటుడు హాజరు కావాల్సి ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం పట్ల బాబు మోహన్ ఆమెకు అభినందనలు తెలిపారు.