SKLM: గంగువాడ గ్రామానికి చెందిన రావలవలస ధర్మారావు (52) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె నిశ్చితార్థం రోజున మద్యం సేవించినందుకు భార్య మందలించి, మద్యం బాటిల్ తీసుకోవడంతో మనస్తాపం చెంది ధర్మారావు మద్యం మత్తులో పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.