ప్రకాశం: మద్దిపాడులోని అంగన్వాడి కేంద్రాన్ని మంగళవారం ఐసీడీఎస్ కమిషనర్ సూర్యకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తల్లులతో, చిన్నారులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం సరిగా అందుతుందా, నాణ్యంగా ఉంటుందా లేదా, అని ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో లక్ష్మీ ప్రసనగన పాల్గొన్నారు.