ASR: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామ సమీపంలోని బురదగెడ్డ వంతెన మరమ్మత్తులకు మోక్షం కలిగింది. మరమ్మత్తులకు జిల్లా కలెక్టర్ ఉపాధిహామీ నుంచి రూ.10 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీడీవో లవరాజు పేర్కొన్నారు. ఆర్&బి ఈఈ బాలసుందరబాబు బుధవారం బురదగెడ్డ వంతెనను పరిశీలించారు. వర్షాలు తగ్గిన తరువాత రిపేరు పనులు ప్రారంభిస్తామని ఈఈ తెలిపారు.