W.G: లబ్దిదారులకు ప్రభుత్వం అందించే నిత్యవసరాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నరసాపురంలో పలు రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుల వివరాలను పరిశీలించారు. ప్రజలు నుంచి డీలర్లపై పిర్యాదులు వస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.