ASR: చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై మంత్రి వెంటనే స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. కలెక్టర్, పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెంటనే రిపోర్ట్ చేయాలన్నారు.