CTR: పుంగనూరు పట్టణం మేలుపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును సోమవారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆరీఫా మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆకాంక్షించారు. అలాగే రైట్ టూ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో యాక్ట్‌పై అవగాహన కల్పించారు.