TG: రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్లు TTD ప్రకటించింది. ఈ విధానాన్ని మార్చి 24వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ మేరకు వారానికి 4 లేఖలకు అనుమతిస్తారు. వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖలను ఆది, సోమవారాల్లో మాత్రమే స్వీకరిస్తారు. దర్శనం సోమ, మంగళవారం ఉంటుంది. రోజుకు ఒక లేఖపై గరిష్టంగా ఆరుగురికి దర్శన అవకాశం ఉండనుంది.