NLR: గుడ్లూరులో మంగళవారం ఊబకాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఊబకాయం, అధిక బరువుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రకృతి విరుద్ధమైన ఆహారపు అలవాటు వల్ల ఎక్కువమంది ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఊబకాయంపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.