AP: వచ్చే నెల 15 తర్వాత రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాత్కాలిక సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో తొలుత పనులు మొదలు పెడుతామన్నారు. అక్కడే ప్రధాని మోదీతో సభను నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కాగా, ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించనున్నారు.