ELR: పోలవరం నియోజకవర్గ పరిధిలోని జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో గంధం బోస్ అనే వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం దాడి చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గాయపడిన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.