TG: సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై కుక్క దాడి చేసింది. ఈ ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి సువర్ణ తీవ్రంగా గాయపడిన ఘటన జంతువుల కన్నా.. క్రూరంగా ఉన్న రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. కేసీఆర్ పాలనలో చదువుల కేంద్రాలుగా ఉన్న గురుకులాలు రేవంత్ పాలనలో చావుకేకలు పెడుతున్నాయని మండిపడ్డారు.