సత్యసాయి: కదిరిలో శ్రీ వసంతవల్లభరాయుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ ఘనంగా జరిగింది. సప్త అశ్వాలతో సూర్యనారాయణుడు రథాన్ని నడుపుతున్నట్లుగా వాహనం రూపొందించారు. భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవం కోలాహలంగా సాగింది.