కర్నూలు: కౌతాళం మండలం పొదలకుంట గ్రామంలో మారికాంబ దేవి కుంభోత్సవాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పిల్లలు, పెద్దలతో పాటు పక్క గ్రామాల భక్తులు కూడా పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. కుటుంబాల సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు కలిసి 150కు పైగా కుంభాలు, కొబ్బరికాయలను దేవికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు.