GNTR: తెనాలిలో ఆటో డ్రైవర్లు ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీగా రైల్వే స్టేషన్ వంతెన వద్దకు చేరుకున్న డ్రైవర్లు, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.