KKD: ‘స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ పురస్కారాల్లో జిల్లాకు ఈ ఏడాది మొత్తం 52 అవార్డులు దక్కాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఇందులో ‘స్వచ్ఛ ఇండస్ట్రీస్’, ‘స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూలు’ విభాగాల్లో రెండు రాష్ట్రస్థాయి అవార్డులు ఉన్నాయన్నారు.మిగిలిన 50 అవార్డులు జిల్లాస్థాయిలో 15 కేటగిరీలలో వచ్చాయని తెలిపారు. సహకరించిన అధికారులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు