KKD: గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్‌గా బి. వెంకట భాస్కర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాయవరం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన ఇటీవల తహసీల్దార్‌గా పదోన్నతి పొంది గొల్లప్రోలుకు నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది, అధికారులు ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందిస్తామన్నారు.