TPT: శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాక గ్రామంలో టీడీపీ నాయకుడు వజ్రం కిషోర్‌పై దాడి జరిగింది. బంధువుల పొలం సమస్యను పరిష్కరించేందుకు వెళ్లగా, స్థానికేతరుడివి నీకేం పని అంటూ ఒక వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కిషోర్‌కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.