NTR: రాష్ట్రంలో రాబోయే ‘సెన్యార్’ (Senyar) తుఫాను నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తంగిరాల సౌమ్య కోరారు. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పంట నష్టాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.