SS: గుడిబండ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలు రకాల దస్త్రాలను పరిశీలించి వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం డీఎస్పీ స్థానిక పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ.. సకాలంలో కేసులను పరిష్కరించి అక్రమ మద్యం, గ్యాంబ్లింగ్ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.