GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల బాడీ బిల్డింగ్ టోర్నమెంట్-2025లో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థి సంకా కౌషిక్ సత్తా చాటారు. ఈనెల 18,19 తేదీలలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ & బాడీ బిల్డింగ్ టోర్నమెంట్లో పాల్గొని బాడీ బిల్డింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కళాశాల అధ్యక్షుడు బొల్లిముంత అమరేశ్వరరావు మంగళవారం తెలిపారు.