ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సంచికను ఆవిష్కరించారు. ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గోపా జగదీష్, కృపాకర్ మాట్లాడుతూ.. ఈనెల 22 నుంచి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.