PLD: శావల్యాపురం మండలంలోని ఘంటవారిపాలేం అద్దంకి సాగర్ కెనాల్ వద్ద లారీలు పార్కింగ్ చేసి డ్రైవర్లు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు నాలుగు లారీల్లో డీజిల్‌ను చోరీ చేశారు. ఉదయాన్నే డ్రైవర్లు లేచి చూసేసరికి అయిల్ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ సంఘటనపై శావల్యాపురం ఎస్సై లోకేశ్వరావును వివరణ కోరగా తమకు లిఖితపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు.