GNTR: బాపట్ల వాసి అబ్దుల్ సాద్ ఊనైస్ గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీమ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. చిన్న వయసు నుంచే క్రికెట్లో ప్రతిభ చాటుతున్న సాద్, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే సెంట్రల్ జోన్ అండర్-14 జోన్ మ్యాచ్లలో జిల్లా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అతని ఎంపిక పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.