SRPT: తెలంగాణ పోలీస్ శాఖ ఎరైవ్ – ఎలైవ్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా చర్యలు తీసుకోవాలని SP నరసింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నడిగూడెం మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు, ప్రయాణికులకు రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎస్సై గంధ మల్ల అజయ్ కుమార్ తెలిపారు.