NLR: అంతర్జాతీయ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల హెల్త్ సూపర్వైజర్ షేక్ ఖాజా మొహిద్దిన్ మాట్లాడుతూ.. వృద్ధ వయసు వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి వారి బాగోగులు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.