GNTR: ఫిరంగిపురం(మం) పొనుగుపాడు గ్రామం నుంచి కర్నూలు, గుంటూరు ప్రధాన రహదారికి కలిపే సుమారు 3 కి.మీ జిల్లా పరిషత్ రోడ్డును తక్షణమే నిర్మించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లకుపైగా ఈ రహదారి మరమ్మతులు లేకుండా పూర్తిగా దెబ్బతిని ప్రస్తుతం గుంతలమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.