ప్రకాశం: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం మండలం కేంద్రంలోని గ్రామ శివారులో మద్యం సేవిస్తున్న వారికి ఎస్సై కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.