W.G: తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అనుబంధ, గుర్తింపు పొందిన ఉద్యాన కళాశాలలో బీఎస్సీ (హానర్స్) హార్టీకల్చర్ ప్రవేశానికి ఈనెల 8న ఉ. 9:30 గంటల నుంచి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.