CTR: పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తలు రద్దీ పెరిగింది. ఉదయం 5 గంటల నుంచి రద్దీ కొనసాగుతున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం వెల్లడించారు. సుమారు 15,000 మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను అందించేలా చర్యలు చేపట్టారు.