కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా గుడివాడ ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతిని కలెక్టర్ బాలాజీ ఘనంగా సన్మానించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఆమె కనపరిచిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆదివారం ఉత్తమ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.