KDP: ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ వెనక గల కాలనీలో శుక్రవారం రేషన్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రేషన్ బియ్యం సరఫరా చేయకుండా దోచుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని ఘర్షణకు దిగారు. వీరి వాగ్వాదంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు.