చిత్తూరు టు కామాలూరు నూతన APSRTC బస్ సర్వీసును ప్రారంబించిన పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. ఇటీవల కామాలూరు గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి బస్ సౌకర్యం లేనందున విద్యార్థులు, వృద్ధులు, మహిళల రాకపోకలకు ఇబ్బందిగా వుందని సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే వీలైనంత త్వరగా బస్ సర్వీసును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.