ప్రకాశం: తర్లుపాడు గ్రామంలో గల బస్టాండ్ సెంటర్లో మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మొదటిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.