ప్రకాశం: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని బాపట్ల జిల్లా నోడల్ ఆఫీసర్ టీవీ తులసీరామ్ అన్నారు. అద్దంకి పట్టణంలోని విద్యుత్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించేందుకు సోలార్ రూప్‌టాప్ కింద భారీగా రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని అన్నారు.