కృష్ణా: కౌతవరం నుంచి మామిడికోళ్ల వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి, ప్రజలు నడవటానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. రహదారి ఇరువైపులా పెరిగిన ముళ్ల చెట్లు రహదారిని ఆక్రమించి, ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామస్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ట్రాక్టర్ల సహాయంతో రహదారిని శుభ్రపరిచారు.