GNTR: రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం బుధవారం నుంచి మరోసారి భూసమీకరణ ప్రారంభించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో 1,937 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు అలాగే, పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం 3,361 ఎకరాలు, పెదమద్దూరు 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166, కర్లపూడి-లేమల్లె 2,944 ఎకరాలుగా సమీకరణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.