GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. పారిశుద్ధ్యం, మున్సిపల్ మంచినీటి సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా శానిటరీ ఇన్స్పెక్టర్కి సూచించారు. అనంతరం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.