ప్రకాశం: తాళ్లురులోని గుంటి గంగమ్మ జాతర తిరుణాల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ సోమవారం రాత్రి పరిశీలించారు. తిరుణాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిష్ఠ బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పోలీసులకు ఎస్పీ సూచించారు.