EG: దవళేశ్వరంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ దళిత నాయకుల ఆత్మీయ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దళితులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. దీనికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేయబోతుందని కావున ఎస్సీ వర్గీకరణకు పట్టు బట్టవద్దని, అలాగే దళితులందరూ కలసి ఒక్కటిగా ఐక్యంగా ఉండాలని కోరారు.