GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.