PPM: భద్రగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు మహా ప్రస్థానం వాహనాలను ఏర్పాటు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల భద్రగిరి ఆసుపత్రి నుంచి మహిళ మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకోవాలన్నారు.