SS: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు ఆనంద్ ఫౌండేషన్ సౌజన్యంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేయనున్నారు. పండుగ వాతావరణంలో స్థానిక మహిళలు ఉత్సాహంగా ముగ్గులు వేస్తూ పోటీ పడుతున్నారు.