VSP: సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సబ్బవరం, పరవాడ మండలాల్లో 19 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ అనిల్ కుమార్ తెలిపారు. సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ… పరవాడ మండలానికి 11, సబ్బవరం మండలానికి 8 దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. మద్యం షాపులు ఏర్పాటుకు దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు డీడీ తీయాలన్నారు.