SKLM: రూరల్ పోలీస్ స్టేషన్ను శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి ఈ మేరకు పోలీసు స్టేషన్లోని రిసెప్షన్ కేంద్రం తోపాటు పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన డ్యూటి రిజిస్టర్స్ నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి కేటాయించిన విధులు, వారి పనితీరులపై ఆరా తీశారు.