SKLM: జి.సిగడాం మండలం బాతువ గ్రామంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో 22వ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.