WG: స్వస్త్ నారి-సశక్త్ పరివార్ అభియాన్ను ఈనెల 17న ప్రారంభించనున్నట్లు DMHO గీతాభాయ్ తెలిపారు. మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడమే దీని లక్ష్యమని వివరించారు. ఆదివారం భీమవరంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 471 ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని, వీటిలో అన్ని రకాల వైద్య సేవలు పొందవచ్చని ఆమె ప్రజలకు సూచించారు.