VZM: పూసపాటిరేగ పరిధిలోని 33 KV విద్యుత్ లైన్ మరమ్మత్తులు, చెట్లు కొమ్మలను తొలగింపు కారణంగా మంగళవారం ఉ.8 నుంచి సా.5 గంటల వరకు రెల్లివలస, కొండగుడ్డి, చల్లవానితోట, కే.జీ. యాతపేట, మల్కాం, ఎల్.డి. తోట, సేరిపోలం, బి.వి. కల్లాలు, బొర్రవాని పాలెం, కుమిలి ప్రాంతాలకు సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఏఈ దేముడు సోమవారం ఒక ప్రకటనలో కోరారు.