Vsp: పోలీస్ కమిషనరేట్ ప్రజావేదిక కార్యక్రమంలో 99 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి చట్ట ప్రకారం విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. అనంతరం ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.