NDL: సోలార్ ప్రాజెక్టు భూసేకరణ పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాక రెడ్డికి గుంతకల్లు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు నందికోట్కూరులో ఆయన దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుత్తి, పామిడి మండలంలో ప్రాజెక్టు భూసేకరణ వెళ్లిన వారిపై గుంతకల్లు ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం దుర్మార్గం అన్నారు.